: ఫిక్సర్లకి కనీసం పదేళ్ళ శిక్షయినా విధించాలి
ఏమాత్రం నిజాయతీ ఉన్నా బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తన పదవికి రాజీనామా చేయాలని శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) డిమాండ్ చేసింది. మీడియా సంస్థలు క్రికెటర్లను హీరోలుగా చిత్రీకరిస్తాయని, టీమిండియా అంటూ ఒక ప్రైవేటు సంస్థని ఆకాశానికి ఎత్తుతాయని, అభిమానుల నుంచి ఆకాశమంత గౌరవం అందుకునే క్రికెటర్లు అవినీతికి పాల్పడ్డప్పుడు వారికి కనీసం పదేళ్ళ జైలు శిక్షైనా విధించాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. మరో వైపు ఇండియా సిమ్మెంట్స్ యాజమాన్యం దర్యాప్తు సంస్ధల అదికారులకు పూర్తిగా సహకరిస్తామంది.