: గురునాథ్ ఎక్కడ?... చెన్నై ఫైనల్ ఆడుతుందా?
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. గురునాథ్ విచారణకు హాజరుకాకపోవడంతో అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవహారంలో శ్రీనివాసన్ హస్తంకూడా ఉండి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో శ్రీనివాసన్ రాజీనామా చేస్తున్నారని వదంతులు వ్యాపించాయి. ఈ దశలో ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని కానీ, సీఈవో కానీ, అరెస్టు అయితే ఆ ఫ్రాంచైజీని రద్దు చేసే అవకాశం ఉంది.
గురునాథ్ కి చెన్నై ఫ్రాంచైజీకి ఉన్న బంధం విషయంలో వివరణ లేకపోవడంతో ఇండియా సిమ్మెంట్స్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ లో గురునాథ్ చెన్నై సూపర్ కింగ్స్ సీఈవోగా మ్యాచ్ లకు హాజరు కాలేదని, అతను కేవలం గౌరవ సభ్యుడేనని స్పష్టం చేసింది. మరో వైపు అతనిపై ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇండియా సిమెంట్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఐపీఎల్ లో చెన్నై ఫైనల్ లో ఆడేది ఖాయమైంది. కానీ, గురునాథ్ పట్టుబడితే కానీ దొంగలెవరు? దొరలెవరు? అనేది క్లారిటీ రాదు.