: రష్యా సముద్రగర్భంలో భారీ భూకంపం
రష్యా ఒఖాట్స్క్ సముద్రంలో నేడు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేల్ పై ఈ ప్రకంపనల తీవ్రత 8.2గా నమోదైంది. భూగర్భంలో సుమారు 601.80 కిలోమీటర్ల లోతున ఈ పెనుకంపం చోటు చేసుకుంది. భూకంప కేంద్రం రష్యాలోని కామ్ చట్కా ప్రాంతంలోని ఎస్సో పట్టణానికి వాయువ్య దిశగా 360 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాగా, ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశంలేదని అలాస్కా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రగర్భంలో చాలా లోతున ప్రకంపనలు సంభవించడమే అందుకు కారణమని పేర్కొంది.