: చిరంజీవిపై సీబీఐ జేడీకి ఫిర్యాదు
కేంద్ర మంత్రి చిరంజీవిపై సీబీఐ జేడీకి ఫిర్యాదు చేశారు ఓయూ జేఎసీ ప్రతినిధులు. ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ పర్యాటక సదస్సు సందర్భంగా చిరంజీవి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని వారు జేడీ లక్ష్మీనారాయణకు వివరించారు. తక్షణమే చిరంజీవిపై విచారణ ప్రారంభించాలని విద్యార్థులు కోరారు. ఓయూ జేఏసీ ఇదే విషయమై నిన్న హైదరాబాద్ లోని చిరంజీవి నివాసాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు విద్యార్థి నేతలను అరెస్టు చేశారు.