: 7 లక్షల నగదుతో ఉడాయించిన దుండగులు
హైదరాబాద్ లో స్నాచర్లు స్వైరవిహారం చేస్తున్నారు. ఒంటరిగా మహిళలు కనబడితే చాలు... చైన్ లు, బ్యాగులు లాగేసుకుని మాయమైపోతున్నారు. ప్రతి రోజూ నగరంలో ఏవర్నో ఒకర్ని టార్గెట్ చేసి స్నాచింగ్ చేసి పరారైపోతున్నారు. తాజాగా వనస్థలిపురంలో ఓమహిళ చేతినుంచి 7 లక్షల నగదు కాజేసి ఉడాయించారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆ మహిళా అంత పెద్దమొత్తం నగదు తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.