: ఫిక్సింగ్ చట్టబద్దం చేస్తే రెండిందాల లాభమట!
స్పాట్ ఫిక్సింగ్ ను అరికట్టాలంటే బెట్టింగ్ ను చట్టబద్దం చేసెయ్యాంటూ సలహాలు వెల్లువెత్తుతున్నాయి. సినీతారలు, సీనియర్ క్రికెటర్లు విశ్లేషకుల సరసన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫిక్కీ) కూడా చేరింది. ఫిక్సింగ్ ను చట్టబద్దం చేస్తే ఆదాయానికి ఆదాయము, వినోదానికి వినోదమూ దక్కుతాయని సూచించింది. దేశంలో ఆటలపై పందాలు కాయడాన్ని చట్టం చేయాలని అభిప్రాయపడింది. బెట్టింగ్ ను నిషేధించినప్పటికీ గుట్టుగా అది కొనసాగుతోందని పేర్కొంది. స్పాట్ ఫిక్సింగ్ ద్వారా, బ్లాక్ మార్కెట్ విధానాల ద్వారా ప్రభుత్వానికి 12-20 వేల కోట్లు నష్టం వస్తొందని అభిప్రాయపడింది.