: గురునాథ్ సొమ్ముతో పందాలు కాశాను: విందూ సింగ్
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ సింగ్ రోజుకో విస్మయకర విషయం వెల్లడిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ గురునాథ్ మెయ్యప్పన్ తో నిరంతరం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటానని వెల్లడించిన విందూ.. పోలీసు విచారణలో మరికొన్ని వివరాలు బయటపెట్టాడు. తాను బెట్టింగ్ కు పాల్పడింది గురునాథ్ పేరిటేనని చెప్పాడు. అతడి సొమ్ముతో పందాలు కాశానని పేర్కొన్నాడు. అంతేగాకుండా, గురునాథ్ కు బెట్టింగ్ లో రూ.1 కోటి నష్టం వాటిల్లినట్టు కూడా వెల్లడించాడు.
కాగా, తన అల్లుడు ఫిక్సింగ్ స్కాంలో ఇరుక్కోవడంపై బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ స్పందిస్తూ, నిజం విచారణలో తేలుతుందన్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ, తనను రాజీనామా చేయాలని కోరడం అసమంజసం అని పేర్కొన్నారు. గురునాథ్ ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు.