: స్పాట్ ఫిక్సింగ్ విచారణకు బయల్దేరిన గురునాధ్
ఊరందరిదీ ఒక దారి ఉలిపిరి కట్టెది ఇంకోదారి అన్నట్టు స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో క్రికెట్ సంబంధిత రంగం మొత్తం కుదుపుకు గురై, ఎప్పుడు ఎవరికి పోలీసుల నుంచి పిలుపు వస్తుందో అని టెన్షన్ పడుతుంటే, ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గురునాధ్ వేసవి విడిది నుంచి పోలీసు విచారణకు తీరిగ్గా బయలుదేరారు. కొడైకెనాల్ లో మామతో పాటూ సేదదీరుతున్న గురునాథ్ సోమవారం హాజరవుతానని చెప్పగా ఢిల్లీ పోలీసులు తక్షణం హాజరవ్వాలంటూ ఆదేశించారు. దీంతో న్యాయవాదులను సంప్రదించిన గురునాథ్ ఢిల్లీ బయల్దేరారు. నేటి సాయంత్రం పోలీసుల విచారణ ఎదుర్కోనున్నారు.