: వసతి గృహాల సమస్యలపై జూన్ 15 నుంచి అధ్యయనం
జూన్ 15 నుంచి 21 వరకు కేవీపీఎన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల సమస్యలపై బృందాలుగా ఏర్పడి అధ్యయన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. చిక్కడపల్లిలో జరిగిన రెండో రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా పాటూరి రామయ్య ఎన్నికవ్వగా, ప్రధాన కార్యదర్శిగా జాన్ వెస్లీ నియమితులయ్యారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు ఒక విశాల ఐక్య వేదిక నిర్మించి ముందుకు సాగుతామన్నారు.