: ఖాతాదారుల సొమ్ముతో ఆస్తులు వెనకేసుకున్న అభయగోల్డ్
ఖాతాదారుల నుంచి అధిక వడ్డీల పేరుతో నిధులను సేకరించి, ఆ సొమ్ముతో అభయ గోల్డ్ రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాలు కొనుగోలు చేసిందని విజయవాడ పశ్చిమ ఏసీపీ హరికృష్ణ మీడియాకు తెలిపారు. ఈ ఉదయం అభయగోల్డ్ కార్యాలయంలో తనిఖీల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అభయగోల్డ్ ఎండీతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతకుముందు అభయగోల్డ్ ఎండీ శ్రీనివాసరావును పోలీసులు ప్రశ్నించారు. ఖాతాదారుల నుంచి సేకరించిన సొమ్ము, ఎక్కడ పెట్టుబడి పెట్టిందీ తదితర వివరాలు ఆయన నుంచి సేకరించారు.