: 'ఆ నలుగురికి ఉరి' సబబు కాదు : వీరప్పన్ భార్య


వీరప్పన్ అనుచరుల క్షమాభిక్ష తిరస్కరించకుండా ఉండాల్సిందని ఆయన భార్య ముత్తులక్ష్మి అభిప్రాయపడ్డారు. మందుపాతర పేల్చి 22 మంది పోలీసులను బలిగొన్నకేసులో నిందితులైన జ్ఞాన ప్రకాష్ (వీరప్పన్ సోదరుడు), సైమన్, 'మీసాయ్'మాదయన్, పిలవేంద్రన్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో ముత్తులక్ష్మి స్పందించారు.

'ఇప్పటికే నా భర్తను ధర్మపురి వద్ద తమిళనాడు పోలీసులు చంపేశారు. ఇప్పుడు ఈ నలుగురు అనుచరులనూ ఉరి తియ్యబోతున్నారు. దయచేసి ఆ శిక్షను అమలు చేయొద్దు' అని ఆమె వేడుకొన్నారు. కాగా, గతంలో  వీరప్పన్ ను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ఎస్టీఎఫ్ దళాలకు నేతృత్వం వహించిన మాజీ పోలీసు అధికారి కె. గోపాలకృష్ణన్ ఈ విషయంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 22 మంది అమాయక పోలీసులు చనిపోయిన ఈ కేసులో ఆలస్యమైనా న్యాయం జరిగిందన్నారు.

  • Loading...

More Telugu News