: అంజలిపై హైకోర్టు సీరియస్
సినీ నటి అంజలిపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరువు నష్టం కేసు విచారణకు హాజరు కాకపోవడంపై మండిపడింది. జూన్ 5న తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది. అంజలి నెల క్రితం దాగుడు మూతల ఆట ఆడిన సంగతి తెలిసిందే. దర్శకుడు కలంజియం, పిన్ని భారతీదేవీ తనను నిలువెల్లా దోచేశారని, చంపుతానని బెదిరించారని ఆ సమయంలో అంజలి సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై దర్శకుడు కలంజియం మాద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. విచారణకు హాజరు కావాలని కోర్టు గతంలో అంజలికి నోటీసులు జారీ చేసింది. అయినా, ఈ రోజు విచారణకు ఆమె హాజరు కాలేదు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5న విచారణకు హాజరు కావాలని కఠినంగా ఆదేశించింది.