: మండే సూర్యుడి ఉగ్ర రూపం
రాష్ట్రంలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నిప్పుల కుంపటిని తలపిస్తూ మండిపోతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా అతలాకుతలం చేసేస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్తే వస్తామో రామో తెలియనంత తీవ్రంగా ఎండ మండిపోతుంది. ఈ రోజు ఇప్పటివరకూ 22 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 44 డిగ్రీలు దాటాయి ఉష్ణోగ్రతలు. బయటకి వెళ్ళేవారు పలు ఆరోగ్యసూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు.