: వాయిదాల పద్ధతిలో బ్లాక్ బెర్రీ ఫోన్


క్రేజీ బ్లాక్ బెర్రీ ఫోన్లను ఇక మీ వద్ద డబ్బు లేకపోయినా కొనేయడం ఈజీ. వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లించొచ్చు. కాకపోతే క్రెడిట్ కార్డు ఉండాలి. ఈ అవకాశాన్ని బ్లాక్ బెర్రీ రెండు మోడళ్ల కొనుగోలుపై కల్పిస్తోంది. బ్లాక్ బెర్రీ జెడ్ 10ను కొనుగోలు చేసిన వారు క్రెడిట్ కార్డు ద్వారా నెలకు 4,799 రూపాయలు తొమ్మిది నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కర్వ్ మోడల్ ను కొన్నవారు నెలకు 799 రూపాయలు 12 నెలల పాటు చెల్లించాలని బ్లాక్ బెర్రీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 3000 షోరూమ్ లలో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News