: అమ్మ సాఫ్ట్.. నేను హార్డ్: రాహుల్
రాహుల్ గాంధీ క్రమశిక్షణ విషయంలో పార్టీ నేతలకు కొత్త సందేశం ఇస్తున్నారు. మరో నెలరోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం అయ్యారు. అందరూ కలిసికట్టుగా శ్రమించి, సమన్వయంతో పనిచేసి నాలుగోసారి పార్టీకి ఢిల్లీలో అధికారం కట్టబెట్టేలా చేయాలని రాహుల్ కోరారు. "కాంగ్రెస్ అధినేత్రి సున్నితం.. కానీ నేను కాదు. క్రమశిక్షణ ఉల్లంఘనను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించను" అని రాహుల్ కొంత కఠినంగానే నేతలకు దిశానిర్దేశం చేశారు.