: సన్‌స్పాట్‌కు కారణమేమంటే...!


సూర్యుడిపై నిరంతరం విస్ఫోటనాలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడూ సూర్యుడిపై చిన్నపాటి మచ్చలు కూడా తెలుస్తుంటాయి. ఈ విస్ఫోటనాలకు, మచ్చలకు కారణాలను శాస్త్రవేత్తలు బట్టబయలు చేశారు. సూర్యుడి అంతర్భాగంలోని అయస్కాత క్షేత్రంలో నిరంతరం జరిగే చలనాలే దీనికి కారణం అంటున్నారు.

షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు సూర్యుడి అంతర్భాగంలోని అయస్కాంతక్షేత్రంలో నిరంతరం చలనాలు ఏర్పడుతుంటాయని, ఈ చలనాలే సన్‌ఫ్లేర్‌, సన్‌స్పాట్‌ల వంటి పలురకాలైన మార్పులకు కారణమని తేల్చారు. సూర్యుడిలో ఏర్పడే ఈ చలనాలు ఒకరకంగా మనిషి గుండె స్పందననను పోలి ఉంటాయని వారు చెబుతున్నారు. సూర్యుడిలో ఉండే అయోనైజ్డ్‌ గ్యాస్‌ (ప్లాస్మా) చలనాల వల్ల అయస్కాంత క్షేత్రంలో మార్పులు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News