: కొత్త నక్షత్ర మండలం ఏర్పడుతోంది!
విశ్వంలో పలు నక్షత్రమండలాలు ఉన్నాయని చెబుతోన్న శాస్త్రవేత్తలు ఒక సరికొత్త నక్షత్ర మండలం ఏర్పడుతోన్న విషయాన్ని గుర్తించారు. సుమారు 1100 కోట్ల సంవత్సరాల క్రితం రెండు గెలాక్సీలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ పరిణామంతో ఒకదానితో ఒకటి కలిసి ఒక సరికొత్త నక్షత్ర మండలంగా ఏర్పడడం ప్రారంభమయింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన హాయ్‌పు నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం హెర్షెల్ టెలిస్కోపును ఉపయోగించి గుర్తించింది. ఈ సరికొత్త నక్షత్ర మండలానికి 'హెచ్‌ఎక్స్‌ఎంఎం01' అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడు పుడుతున్న సమయంలోనే అంత్యదశకు చేరువవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.