: మన ఆరోగ్యాన్ని తెలిపే అరుదైన థర్మామీటర్‌!


మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అనే విషయాన్ని ఎలా కనుక్కోగలం...? ఈ విషయాన్ని పలు పరీక్షలు నిర్వహించి అప్పుడు తెలుసుకొంటాం. అయితే ఒక థర్మామీటర్‌ మన ఆరోగ్యాన్ని గురించి ఇట్టే తెలియజెప్పేస్తే...! ఇలాంటి ధర్మామీటర్‌నే శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ థర్మామీటర్‌ మనలోని జన్యు పదార్ధం ఆరోగ్యంగా ఉందో లేదో తేల్చి చెపుతుందట. అందుకే దీన్ని 'జెనెటిక్‌ థర్మామీటర్‌' అంటున్నారు.

న్యూయార్క్ లోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వైద్య కళాశాల వైద్యులు డాక్టర్‌ అట్జమాన్‌ ఈ థర్మామీటర్‌ను అభివృద్ధి చేశారు. మనిషి అవయవాల్లోని టెలోమిరేజ్‌ ఎంజైము క్రోమోజోములపై టెలోమీర్‌లను పెంచుతుంది. ఇవి క్రోమోజోములపై మూతల్లాగా పనిచేసి, జన్యువులు కణాలుగా మారకుండా చేస్తాయి. మన వయసుతో పోల్చి చూసినపుడు జన్యుపదార్ధం ఎక్కువగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు, తక్కువగా ఉంటే అనారోగ్యంగా ఉన్నట్టని అట్జమాన్‌ అంటున్నారు. కాబట్టి ఇలాంటి థర్మామీటర్‌తో మన ఆరోగ్యాన్ని గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని జాగ్రత్తగా కాపాడుకోవచ్చుకదా!

  • Loading...

More Telugu News