: మనకు మనమే క్యాన్సర్ పరీక్ష చేసుకోవచ్చు!
మనకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. అలాకాకుండా మనకు మనమే ఇంట్లోనే ఈ పరీక్ష చేసుకునేలా వీలుంటే, అప్పుడు ఎవరికి వారు ఈ పరీక్షలు చేసుకొని తమకు క్యాన్సర్ ఉందో లేదో చక్కగా తెలుసుకోవచ్చుకదా...! ఇప్పుడు ఇలాంటి పరికరాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు.
మనకు మనమే మూత్ర పరీక్ష చేసుకుని ప్రొస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో కనుగొనేలా ఒక ప్రత్యేక పరికరాన్ని పరిశోధకులు రూపొందించారు. ఈ పరికరాన్ని జనరల్ స్టోర్లలో కూడా తక్కువ ధరకు లభ్యమయ్యేలా, అందరికీ అందుబాటులో ఉండేవిధంగా తయారు చేయనున్నారు. ఈ పరిజ్ఞానంతో మూత్రకోశ, ఎముక సంబంధిత క్యాన్సర్లను కూడా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన క్రితిక మోహన్ కూడా ఉన్నారు.