: ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్ళు
వేసవి రద్దీని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేస్తోంది. మొత్తం 70 రైళ్ళను వివిధ మార్గాల్లో నడపాలని నిర్ణయించినట్టు దక్షిణ మధ్య రైల్వే నేడు ఓ ప్రకటనలో తెలిపింది. గుంటూరు-తిరుపతి, హైదరాబాద్-రేణిగుంట, ఔరంగాబాద్-తిరుపతి, విజయవాడ-లింగంపల్లి, సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-మచిలీపట్నం, సికింద్రాబాద్-నాగర్ సోల్ మధ్య ఈ రైళ్ళు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.