: సౌదీ నుంచి బహిష్కరణ ఎదుర్కోనున్న వేలాది భారతీయులు
సరైన పత్రాలు లేని కారణంగా వేలాది భారతీయులు సౌదీ అరేబియా నుంచి బహిష్కరణకు గురికానున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. వీరికి సహాయం చేసేందుకు పది అధికారులతో కూడిన బృందాన్ని మరో నెలన్నర రోజుల్లో సౌదీ పంపనున్నట్టు ఆయన తెలిపారు. సరైన పాస్ పోర్టులు లేకుండా ఉన్న 56,700 మంది భారతీయులు ఇప్పటివరకు సౌదీలోని భారత దౌత్య కార్యాలయం వద్ద తమ పేర్లను నమోదు చేయించుకున్నారని ఆయన వెల్లడించారు. మరో రెండ్రోజుల్లో తాను సౌదీ పయనం అవుతున్నానని, బహిష్కరణకు గురికాబోతున్న భారతీయులు సురక్షితంగా స్వదేశం చేరేందుకు అక్కడి అధికారులతో చర్చించి తగిన ఏర్పాట్లు చేస్తామని ఖుర్షీద్ తెలిపారు.