: సిబ్బందిని భారీగా కుదించిన లాంకో ఇన్ఫ్రా టెక్


ఒకవైపు నానాటికీ పెరిగిపోతున్న రుణభారం, మరోవైపు రావాల్సిన బకాయిలు సకాలంలో అందక సతమతమవుతున్న ల్యాంకో ఇన్ఫ్రాటెక్ కంపెనీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. గత ఏడాది కాలంలో 1400 మంది సిబ్బందిని తొలగించామని సంస్థ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 8000 కాగా ప్రస్తుతం 6600 మంది విధుల్లో కొనసాగుతున్నారు.

ల్యాంకో కంపెనీకి అందాల్సిన బకాయిల విలువ రూ. 3525 కోట్లు కాగా, డిస్కం ల నుంచే రూ. 2800 కోట్లు రావాల్సి ఉందని సంస్థ సీఎఫ్ఓ ఆదిబాబు చెప్పారు. విద్యుత్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న ఒడిదుడుకులే తాజా పరిస్థితికి కారణమని ఆయన విశ్లేషించారు. కాగా, గత డిసెంబర్ త్రైమాసికం ముగిసేనాటికి ల్యాంకో రూ. 465 కోట్లు నికర నష్టాన్ని చవిచూసింది.

  • Loading...

More Telugu News