: పాక్ అంపైర్ రవూఫ్ పై ఐసీసీ వేటు
పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్ ను చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లండ్ వేదికగా జూన్ 6న ఆరంభం కానుంది. కాగా, ఐపీఎల్-6లో సంచలనం సృష్టించిన స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో క్రికెటర్లతో పాటు రవూఫ్ పాత్రపైనా అనుమానాలు తలెత్తాయి. రవూఫ్ ఐపీఎల్ తాజా సీజన్ లో చాలా మ్యాచ్ లకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ముఖ్యంగా ఫిక్సింగ్ జరిగిన మ్యాచ్ లలో ఎక్కువగా రవూఫే అంపైర్ గా ఉన్నాడు. దీంతో, ఆయన్ను ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ.. చాంపియన్స్ ట్రోఫీ నుంచి రవూఫ్ ను తప్పించింది.