: 60 లక్షలు ఆర్ బీఐ అనుమతితోనే పంపాము: మంత్రి పార్థసారధి
మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై మంత్రి పార్థసారధి వివరణ ఇచ్చారు. విజయవాడ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో ప్లాస్టిక్ కంపోస్ట్ తయారీ పరిశ్రమకు యంత్ర సామగ్రిని స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించామని, అందుకు స్విస్ కంపెనీకి ముందుగా 15శాతం డబ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. మిగిలిన 85 శాతం డబ్బును ఐదేళ్లపాటు విడతలవారీగా చెల్లించేలా ఒప్పందం కుదిరిందన్నారు. అయితే మిగిలిన 85 శాతం డబ్బు ఆంధ్రాబ్యాంకు చెల్లించేందుకు నిరాకరించిందని, దీంతో అప్పటికే చెల్లించిన సొమ్మును స్విస్ కంపెనీ జప్తు చేసుకుందని తెలిపారు. అయితే ముందుగా చెల్లించిన 60 లక్షల రూపాయల మొత్తాన్ని ఆర్బీఐ అనుమతి తోనే పంపించినట్టు వెల్లడించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తమను తప్పుపట్టలేదని తెలిపారు.