: ఫిక్సింగ్ పై స్పందించిన దీపిక


ఐపీఎల్ ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పందించింది. తన తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే హయాంలో క్రీడలు చాలా స్వచ్ఛంగా ఉండేవని పేర్కొంది. ఇలాంటి అవినీతి చర్యలతో ఏ క్రీడకైనా చెడ్డపేరు తప్పదని అభిప్రాయం వ్యక్తం చేసింది. బాలీవుడ్ నటుడు విందూ సింగ్ ఈ కుంభకోణంలో పోలీస్ కస్టడీకి చేరడంపై మాట్లాడుతూ, కొందరి మూలంగా మరికొందరు చిక్కుల్లో పడతారని వ్యాఖ్యానించింది. బాల్యంలో తాను చూసిన పరిశుద్ధ క్రీడా ప్రపంచానికి ఇప్పుడిలా అవినీతి మకిలి అంటడం తనను అసంతృప్తికి గురిచేసిందని దీపిక విచారం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News