: అమెరికా రచయిత్రికి బుకర్ ప్రైజ్
అమెరికన్ రచయిత్రి లిడియా డెవిన్ ఈ ఏడాది మాన్ బుకర్ అంతర్జాతీయ బహుమతి విజేతగా నిలిచారు. లండన్ లోని విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ బహుమతిని అందుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ బహుమతికోసం లిడియా 9 మంది ఉద్దండులతో పోటీ పడ్డారు. వీరిలో భారత్ కు చెందిన యూఆర్ అనంతమూర్తి కూడా ఉన్నారు. సృజనాత్మక రచనల బోధానా వృత్తిలో ఉన్న ఆమె రచనలు, క్లుప్తతను పునర్నిర్వచిస్తాయని జ్యూరీ బృందం అభిప్రాయపడింది. ఆమె ఇప్పటి వరకూ 7 కథా సంపుటాలను ప్రచురించారు.