: కాశ్మీర్లో కామాంశ సంభూతుడు!


తనను తాను దైవంలా అభివర్ణించుకున్న ఓ నకిలీ బాబా గుట్టు రట్టయింది. కాశ్మీర్లో అమాయక ఆడపిల్లలపై లైంగిక ఆకృత్యాలకు పాల్పడుతున్న ఆ నీచుడికి అరదండాలు పడ్డాయి. గుల్జార్ అహ్మద్ బట్ (42) అనే వ్యక్తి తాను దైవాంశ సంభూతుడినని చెప్పుకుంటూ బుద్గాం జిల్లాలో ఖాన్ సాహిబ్ వద్ద ఓ ఆధ్మాత్మిక కేంద్రం నెలకొల్పాడు. బాలికలకు మత సంబంధ విషయాల్లో స్వల్ప కాలిక కోర్సులు బోధించే ఈ కేంద్రంలో 500 మంది వరకు ఆడపిల్లలు ఉన్నారు. ఈ అభంశుభం తెలియని బాలికలపై గుల్జార్ తన కామ వికారాలను ప్రయోగిస్తూ, వారిని తన లైంగికావసరాలకు వినియోగించుకుంటున్న వైనం బట్టబయలైంది.

ఈ కామాంధుడు ఓ బాలికతో శృంగారం నెరుపుతున్న దృశ్యాన్ని ఇంతియాజ్ అనే వ్యక్తి చూడడంతో ఈ దారుణకాండ వెలుగులోకి వచ్చింది. వ్యవహారం పోలీసుల వరకు వెళ్ళడంతో బాబాగారి లీలలు ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి. ఈ ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయిలను 'పరిశుద్ధీకరణ' పేరిట గుల్జార్ పదేపదే అనుభవించాడని పోలీసులు తెలిపారు. బాలికలు నిస్సంకోచంగా తన వద్దకు వచ్చేలా చేసేందుకు కొందరు మహిళా ఉద్యోగులను కూడా నియమించాడీ దుష్టుడు.

వారి పనల్లా ఆ అమ్మాయిలకు ఈ కామపిశాచి గురించి గొప్పగా చెప్పడమే. పీర్ సాహెబ్ ను మనసా వాచా కర్మణా ఆరాధిస్తే.. చింతలన్నీ దూరమవుతాయని ప్రబోధిస్తారీ 'ప్రత్యేక' ఉద్యోగినులు. గురుకులంలోకి ఏ కొత్త బాలిక వచ్చినా.. తొలుత గుల్జార్ 'పవిత్ర దృష్టి' సోకాల్సిందేనట. తన గదిలో అడుగుపెట్టిన అమ్మాయిలతో ఈ పీర్ సాహెబ్ చెప్పే మాటలు వింటే.. ఎంత, జుగుప్సాకరంగా ఉంటాయో తెలుస్తుంది.

తాను ఆ బాలిక శరీరంలో ఏ అవయవాన్ని తాకుతాడో.. ఆ భాగాన్ని ఇక అగ్ని కూడా దహింపజాలదంటాడు. ఆ విధంగా మాయమాటలు చెప్పి వారిని తనకు అనువుగా మలుచుకుని పైత్యాన్ని చల్లార్చుకుంటాడు. అయితే, ఈ దారుణం ఎంతో కాలం సాగలేదు. ఇతగాడి పాపం పండడంతో ప్రస్తుతం కటకటాల వెనక్కి చేరాడు.

  • Loading...

More Telugu News