: భారత్ లో అడుగుపెట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
రెండు రోజుల భారత పర్యటనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సియోస్ హాలండ్ ఈ రోజు విచ్చేశారు. రాష్ట్రపతి భవన్లో ఆయన బృందానికి రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మన్మోహన్ స్వాగతం పలికారు. త్రవిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ పర్యటనలో భాగంగా వేల కోట్ల రూపాయల యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
అలాగే పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుగుతాయి. భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశమని.. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళడానికి కృషి చేస్తామని రాష్ట్రపతి భవన్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు హాలండ్ చెప్పారు. ఫ్రాన్స్ లో సిక్కులు తలపాగా ధరించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కూడా హాలండ్ తో చర్చల్లో ప్రస్తావనకు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ ప్రణీత్ కౌర్ చెప్పారు.