: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ వెబ్ సైట్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించింది. ఈ టోర్నీకి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ వెబ్ సైట్ ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. www.icc-cricket.com ద్వారా మ్యాచ్ కు సంబంధించిన హైలైట్స్ వీక్షించవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్లు, ఆటగాళ్ళ వివరాలు, ప్రత్యేక కథనాలు, దృశ్యాలు, లైవ్ స్కోర్ల అప్ డేట్స్ తెలుసుకోవచ్చు. ఇంగ్లాండ్ లోని వేల్స్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జూన్ 6 నుంచి 23 వరకూ జరుగనుంది.