: పత్తా లేని బీసీసీఐ చీఫ్ అల్లుడు


స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలెదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈఓ గురునాథ్ మెయ్యప్పన్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. చెన్నైలోని గురునాథ్ నివాసంలో నేడు ముంబయి పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకుండాపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ కు మేనల్లుడైన గురునాథ్ కు ఫిక్సింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ సింగ్ పోలీసుల విచారణలో గురునాథ్ పేరు బయటపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, గురునాథ్ ను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేడు ప్రశ్నించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News