: చనిపోయిన ఉద్యోగుల పేరిట రూ.3 కోట్లు స్వాహా
ఖమ్మం జిల్లాలో ఓ ప్రభుత్వోద్యోగి చేతివాటం బట్టబయలైంది. ఎన్ఎస్పీ మానిటరింగ్ విభాగంలో అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ)గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి కోట్లాది రూపాయలు దారి మళ్ళించాడు. 2008 నుంచి ఇప్పటివరకు శ్రీనివాస్.. చనిపోయిన ఉద్యోగుల పేరిట వేతనాలను రూ. 3 కోట్ల మేర స్వాహా చేశాడు. విషయం అధికారుల దృష్టికి రావడంతో శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు.