: కొత్త మామిడిపండుకు నిర్భయ పేరు


ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ మామిడి రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కలీముల్లా ఖాన్ తన క్షేత్రంలో పండిన నూతన రకం మామిడి పండుకు ఢిల్లీ అత్యాచార భాధితురాలి పేరు నిర్భయగా నామకరణం చేశారు. ఇది ఆమెకు ఇచ్చే గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్భయ పేరుతో మహిళల రక్షణ కోసం రూ.1000కోట్ల నిధిని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కలీముల్లా ఖాన్ ఉత్తరప్రదేశ్ లోని మలిహాబాద్ లో తన తోటలో 300 రకాల మామిడి కాయలను పండిస్తున్నారు. ఒకే చెట్టుకు 300 రకాలు పండించి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోనూ ఎక్కాడు. గతంలో సోనియాగాంధీ, ఐశ్వర్యారాయ్, అఖిలేశ్ యాదవ్ పేర్లను కూడా మామిడి పండ్లకు పెట్టిన ఘనత కలీముల్లా ఖాన్ కు దక్కుతుంది.

  • Loading...

More Telugu News