: లండన్ లో పేట్రేగిన టెర్రరిస్టులు


లండన్లో టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. పట్టపగలే ఉల్ విచ్ పోలీసు బ్యారక్ ను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. బ్యారక్ లోని సైనికుడి తలను తెగనరికారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక వ్యక్తి రక్తం తడిచిన చేతులతో కనిపించాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. జరిగిన ఘటనలోంచి తేరుకున్న పోలీసులు ఎదురుదాడికి దిగి ఇద్దరు టెర్రరిస్టులను కాల్చేశారు. జరిగిన ఘటనతో లండన్ పరిసర ప్రాంతాల్లోని అన్ని మిలటరీ బ్యారక్స్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసారు. మరో వైపు ప్రధాని డేవిడ్ కేమెరూన్ తన పారిస్ పర్యటన రద్దు చేసుకుని అత్యవసర సమావేశం నిర్వహించారు.

  • Loading...

More Telugu News