: మున్నాభాయ్.. ఖైదీ నెంబర్ 16656


మున్నాభాయ్ కాస్తా ఖైదీ నెంబర్ 16656గా మారిపోయాడు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల సమయంలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు టాడా కోర్టు ఆరేళ్ల జైలు శిక్షను సంజయ్ దత్ కు ఖరారు చేసింది. తర్వాత సుప్రీంకోర్టు దీనిని ఐదేళ్లకు తగ్గించింది. సంజయ్ గతంలో ఏడాదిన్నర జైలు జీవితం గడపగా.. మిగిలిన మూడున్నరేళ్ల జైలు జీవితం పుణెలోని ఎరవాడ జైలులో కొనసాగనుంది. ముంబై ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఎరవాడ జైలుకు నిన్న ఉదయం తరలించిన తర్వాత అధికారులు మున్నాభాయ్ కు పై నెంబర్ కేటాయించారు.

  • Loading...

More Telugu News