: ఫిక్సింగ్ పై గురునాధ్ విచారణ, మరిన్ని సంచలనాలు వెలుగులోకి
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ అధ్యక్షుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురనాధ్ మెయ్యప్పన్ ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ రోజు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే చెన్నైలో 13 మంది బుకీలను అరెస్టులు చెయ్యడం, వారి విచారణలో మరిన్ని పెద్ద తలకాయల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. కాగా గురును విచారించిన తరువాత మరిన్ని సంచలనాలు వెలికి వస్తాయని పోలీసులు అంటున్నారు.