: మండుతున్న ఎండలు
రాష్ట్రంలో ఎండల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఉదయం 10 గంటలకే ఎండ చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉదయం 10 గంటలకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం, నిజామాబాద్ లో 46, హైదరాబాద్, నెల్లూరులో 44, కర్నూలు, తిరుపతిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాగల 24 గంటలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.