: ఇక బీచ్ లు కళకళ
రాష్ట్రంలోని తీర ప్రాంతాలు ఇక పర్యాటకులతో సందడిగా మారిపోనున్నాయి. వెయ్యి కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉన్న తీర ప్రాంతంలో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి చందనాఖాన్ తెలిపారు. విశాఖలో బీచ్ కారిడార్ చేపడతున్నామని చెప్పారు. అలాగే, శ్రీకాకుళం జిల్లాలో బారువ, కళింగపట్నం, విజయనగరం జిల్లాలో చింతపల్లి, తూర్పుగోదావరిలో కాకినాడ, పశ్చిమగోదావరిలో పేరుపాలెం, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం, నెల్లూరు జిల్లాలో తుమ్మలపెంట, కొత్తకోడూరులో బీచ్ ప్రాజెక్టులు రాబోతున్నాయని చందనాఖాన్ వెల్లడించారు. వీటికితోడు హైదరాబాదాద్ లో దుర్గం చెరువు, శామీర్ పేట చెరువు వద్ద కూడా పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు.