: మహిళల బ్యాగుల్లోనే మురికి ఎక్కువట!


ఆడవాళ్లు రోజుకు బోలెడన్నిసార్లు ముఖం కడుక్కుంటారు. బయటికి వెళితే అక్కడ వెంటనే తయారవడానికి అవసరమైన క్రీములు, పౌడర్లు మన ఆడవాళ్ల హ్యాండ్‌ బ్యాగుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అయితే శరీర పరంగా ఇంత శుభ్రత పాటించే ఆడవారి హ్యాండ్‌ బ్యాగుల్లోనే మురికి ఎక్కువగా ఉంటుందట. ఈ మురికిలో 20 శాతం అధికంగా హానికర క్రిములు ఉంటాయట. ఈ విషయాన్ని బ్రిటీష్‌ సంస్థ ఇనీషియల్‌ వాష్‌రూం హైజీన్‌ తన నివేదికలో పేర్కొంది. స్త్రీల హ్యాండ్‌ బ్యాగ్‌లు వివిధ ప్రదేశాలను తాకుతాయని, వాటిని మళ్లీ మనవాళ్లు చేతులతో తాకడం వల్ల క్రిముల వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు తమ పరిశోధనలో వెల్లడైనట్టు ఈ సంస్థ తెలిపింది.

మహిళల హ్యాండ్‌ బ్యాగుల్లో చాలా వరకూ చేతులకు, ముఖానికి రాసుకునే క్రీములు ఉంటాయి. వీటిపై అత్యధిక సంఖ్యలో హానికర క్రిములు నివసిస్తున్నట్టు ఈ సంస్థ తన నివేదికలో తెలిపింది. హ్యాండ్‌బ్యాగుల్లో ఉండే క్రిముల్లో కొన్ని ప్రాణాలకు ముప్పు తెచ్చేవి కూడా ఉండే అవకాశం ఉందని, బ్యాగుల్లో క్రిములు నివసించడానికి అనువైన వాతావరణం ఉంటుందని ఈ నివేదిక చెబుతోంది. కాబట్టి హ్యాండ్‌ బ్యాగులు వాడడం కాదు... వాటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం...!

  • Loading...

More Telugu News