: సహకార ఎన్నికల్లో రాజకీయాలొద్దు: మంత్రి డీఎల్
సహకార సంఘాల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి పెచ్చుమీరిన రాజకీయ జోక్యమే కారణమని మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. సహకార వ్యవస్థను రైతులకు వదిలి వేస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. పార్టీలకు సంబంధంలేని ఈ ఎన్నికల్లో తామే నెగ్గామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు చెప్పుకోవడం సబబు కాదన్నారు. కడప సహకార ఎన్నికల్లో తను జోక్యం చేసుకోలేదని చెప్పారు.