: వార్నర్ కు భారీ జరిమానా


ట్విట్టర్లో ఇద్దరు జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ అందుకు మూల్యం చెల్లించాడు. ఈ విషయంపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ కు రూ. 3.08 లక్షల జరిమానా విధించింది. వార్నర్.. నియమావళిని ఉల్లంఘించాడని నిర్ధారించిన ఆసీస్ క్రికెట్ బోర్డు జరిమానాతో సరిపెట్టింది. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్నర్.. తాజా సీజన్ లో పేలవ ఫామ్ కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో, వార్నర్ వైఫల్యంపై రాబర్డ్ క్రాడాక్, మాల్కమ్ కాన్ అనే ఇద్దరు సిడ్నీ జర్నలిస్టులు 'డైలీ టెలిగ్రాఫ్' పత్రికలో ఓ వ్యాసం రాశారు. దీంతో, వార్నర్ అగ్గిమీదగుగ్గిలమై వారిపై ట్విట్టర్లో బూతుపురాణానికి తెరదీశాడు.

  • Loading...

More Telugu News