: మావాడు మంచోడు: విందూ సోదరుడు
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో పోలీసు కస్టడీ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు విందూ సింగ్ అమాయకుడంటున్నాడు అతని సోదరుడు అమ్రిక్ సింగ్. నేడు మీడియాతో మాట్లాడుతూ, విందూ అవినీతికి పాల్పడ్డాడంటే నమ్మబోనని చెప్పాడు. దర్యాప్తు ప్రారంభమైతే తన సోదరుడికి క్లీన్ చిట్ లభించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశాడు. తన సోదరుడి నిజాయతీ గురించి ముంబయి మొత్తానికి తెలుసన్నాడు. దేవుడి దయవల్ల తమకు సమస్తం సమకూరిందని, ఏదీ ఆయాచితంగా ఆశించాల్సిన అవసరంలేదని అమ్రిక్ చెప్పుకొచ్చాడు. విందూపై విచారణలో పోలీసులకు తమ కుటుంబం సహకరిస్తుందని పేర్కొన్నాడు.