: ఏయూను సెంట్రల్ యూనివర్సిటీ చేస్తే సహించేది లేదు: బండారు
ప్రతిష్ఠాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కేంద్రవిశ్వవిద్యాలయం చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. విశాఖలో ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఏయూని సెంట్రల్ యూనివర్సిటీ చెయ్యాలని వీసీ ప్రయత్నిస్తున్నారని, అతనికి మంత్రులు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఏయూ సెంట్రల్ యూనివర్సిటీ అయితే స్థానిక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అవేదన వ్యక్తం చేసారు. ఈ ఆలోచన విరమించుకోకుంటే విద్యార్ధులతో భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఏయూ ఇంజనీరింగ్ పరిథిలో ప్రశ్నాపత్రం లీకైతే వీసీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.