: గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరగలేదు: లగడపాటి
సున్నపు రాయి గనుల కేటాయింపులో అక్రమాలు జరగలేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. సున్నపు రాయి గనులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేయడంలో మంత్రి పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. గనుల బదలాయింపులో ఎటువంటి తప్పూ జరగలేదన్నారు. సాధారణ జీవోల్లో అక్రమాలు జరిగాయనడం సరికాదని అన్నారు. సీబీఐ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ అయితే కాంగ్రెస్ వారిపై ఎందుకు కేసులు పెడుతుందని ప్రశ్నించారు.