: భారత పాస్ పోర్టుల వ్యవహారం పరిష్కరించిన సౌదీ సర్కారు


కొద్దిరోజులుగా భారత్ పాస్ పోర్టులను నిరాకరిస్తున్న సౌదీ అరేబియా ఇమ్మిగ్రేషన్ శాఖ తాజాగా ఆ వ్యవహారాన్ని పరిష్కరించింది. నూతన ఫార్మాట్లో డిజైన్ చేసిన భారత పాస్ పోర్టులను ఇటీవల సౌదీ అధికారులు తిరస్కరించడంలో పలువురు భారతీయులు ఇబ్బందుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో సౌదీలో భారత దౌత్యవేత్త హమిద్ అలీ రావు.. సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ ఉపమంత్రి అహ్మద్ బిన్ మహ్మద్ అల్ సలెంతో భేటీ అయ్యారు. పరిస్థితులను ఆయనకు వివరించారు. పాస్ పోర్టుల తిరస్కరణ వ్యవహారంలో భారతీయులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు భారత దౌత్యవేత్త వెల్లడించారు.

ఇంతకీ పాస్ పోర్టుల విషయంలో ఎందుకు తేడా వచ్చిందంటే.. పాత పాస్ పోర్టుల్లో వ్యక్తి ఫొటో రెండో పేజీలో ఉండేది. అయితే, నూతన ఫార్మాట్లో డిజైన్ చేసిన పాస్ పోర్టుల్లో వ్యక్తి ఫొటో మూడో పేజీలో ఉండడం సౌదీ అధికారుల అభ్యంతరానికి కారణమైంది.

  • Loading...

More Telugu News