: షీలాదీక్షిత్ నుంచి 11 కోట్లు వసూలు చెయ్యండి: లోకాయుక్త
గోరు చుట్టు మీద రోకటి పోటులా యూపీఏ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ లోకాయుక్త షాకిచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై షీలాదీక్షిత్ నుంచి 11 కోట్లు వసూలు చెయ్యాలని సిఫారసు చేసింది. దీంతో యూపీఏపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.