: ముషారఫ్ కు నిరాశ


రెండ్రోజుల క్రితం బేనజీర్ భుట్టో హత్య కేసులో బెయిల్ పొందిన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు నేడు నిరాశ తప్పలేదు. న్యాయమూర్తుల తొలగింపు కేసులో ముషారఫ్ కు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ మాజీ సైనిక నియంత కేసులను విచారిస్తున్న తీవ్రవాద వ్యతిరేక కోర్టు.. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలను విన్న తర్వాత బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2007లో పాక్ లో ఎమర్జెన్సీ విధించిన ముషారఫ్ పెద్ద ఎత్తున న్యాయమూర్తులను విధుల్లోంచి తొలగించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News