: చంపుతానంటూ శ్రీనివాస్ గౌడ్ బెదిరిస్తున్నారు..
జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్ చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మీడియా సాక్షిగా వాపోయారు. హైదరాబాదులోని భాగ్యనగర్ కాలనీలో ఐదంతస్తుల భవనంలో రాయల్ కిడ్స్ అనే దుకాణాన్ని అద్దెకు నడుపుతున్నానని, ఆషాపు ఖాళీ చేయాలని, లేకుంటే చంపుతానంటూ శ్రీనివాస్ గౌడ్ నుంచి కాల్స్ వస్తున్నాయని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నానని తెలిపారు. అయితే శ్రీనివాస్ గౌడ్ తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణల్ని తోసిపుచ్చారు.