: బుకీలు దుబాయ్ చెక్కేసేందుకు విందూ సాయం!
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ సింగ్ పోలీసు విచారణలో మరిన్ని విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావిస్తోన్న ఇద్దరు బుకీలు దుబాయ్ పారిపోయేందుకు విందూ సాయం చేసినట్టు పోలీసులు అంటున్నారు. బుకీలు పవన్ జైపూర్, సంజయ్ జైపూర్ ఇద్దరూ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగులోకి రాగానే పారిపోవాలని నిశ్చయించుకోగా, వారిద్దరికి విందూనే హోటల్ గది బుక్ చేయడంతోపాటు విమానాశ్రయానికి వెళ్ళేందుకు కారునూ సమకూర్చాడట. కాగా, నేడు ముంబయిలోని విందూ నివాసంలో జరిపిన సోదాల్లో బుకీల్లో ఒకరైన పవన్ కు చెందిన 3 సెల్ ఫోన్లు లభ్యం కావడం ఫిక్సింగ్ ఉదంతంలో ఈ బాలీవుడ్ నటుడి పాత్ర ఉందన్న విషయాన్ని నిర్ధారిస్తోంది.