: అన్ని పార్టీల అజెండా అవినీతే: లోక్ సత్తా
రాష్ట్రంలో అన్ని పార్టీలు అవినీతి అజెండాతోనే పనిచేస్తున్నాయని లోక్ సత్తా ఆరోపించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు నేడు మీడియాతో మాట్లాడుతూ, పార్టీలన్నీ కుమ్మక్కు ఆరోపణలు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఆ ఆరోపణలను వదిలేస్తే, పార్టీలన్నీ అవినీతి అజెండాతో కుమ్మక్కయినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ఆరోపణలతో వ్యవస్థల్లో మార్పు రాదని ఆయన హితవు పలికారు. బలమైన లోక్ పాల్, లోకాయుక్తలతో అవినీతికి చరమగీతం పాడొచ్చని కటారి సూచించారు.