: మిగిలిన కళంకిత మంత్రులూ రాజీనామా చేయాలి: నారాయణ
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హోం మంత్రి సబిత, ధర్మాన రాజీనామా చేసినట్లే మిగతా కళంకిత మంత్రులు కూడా రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వరంగల్ జిల్లా జనగాంలో అన్నారు. కళంకిత మంత్రులతో రాష్ట్రం భ్రష్టుపట్టిందన్న ఆయన, పాలన అవినీతి మయం కావడంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు. అవినీతికి కేంద్రబిందువుగా నిలిచిన ఘనత కాంగ్రెస్ దేనని, ఇప్పటికే వైఎస్ హయాంలోని మంత్రులు జైలు ఊచలు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేసారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్నారు.